*గురుకుల హాస్టళ్లను తనిఖీ చేసిన అధికారులు*
హనుమకొండ: హనుమకొండ జిల్లాలోని పలు గురుకుల హాస్టల్స్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం తనిఖీ చేశారు.
హాస్టల్స్ తనిఖీలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనంతోపాటు ఆహార పదార్థాలు, కూరగాయలు, గుడ్లు, తాగునీరు, వంట చేసే కిచెన్ ప్రదేశాలను జిల్లా అధికారులు పరిశీలించారు. ధర్మసాగర్ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల, కేజీబీవీ పాఠశాలను డి ఆర్ డి ఓ మేన శ్రీను తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలకు సంబంధించి ఆహార పదార్థాల నిల్వను తనిఖీ చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ ను అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఆత్మకూరులోని కేజీబీవీ పాఠశాలతో పాటు పెద్దాపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను గృహ నిర్మాణ డి ఈ రాజేందర్ తనిఖీ చేశారు. పరకాల లోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను జిల్లా వెటర్నరీ అధికారి డాక్టర్ వెంకటనారాయణ తనిఖీ చేశారు.