కిం కర్తవ్యం..!
ఏంటి భవితవ్యం..?
ఏంటి భవితవ్యం..?
రెక్కలు తెగిన ఫ్యాను ముందు ఇప్పుడు చాలా సవాళ్లు పొంచి ఉంటాయి.
ఘోర పరాజయంతో కుదేలైపోయిన క్యాడర్ చెదిరిపోకుండా కాపాడుకోవడం పెద్ద పరీక్ష..
అధికార మదంతో రెచ్చిపోయిన మంత్రులు..ఎమ్మేల్యేలు ఇప్పుడు రివర్స్ లో కేసుల ఎదుర్కోవలసి వస్తే వారిని
కాపాడుకోవడం ఎలా..
ఆ బాధలు పడలేక
తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయే ప్రమాదం ఉండదా.. అఫ్కోర్స్..వీళ్ళు వస్తామన్నా తెలుగుదేశం అధినేత వీరిని రానిస్తారా లేదా అనేది వేరే ప్రశ్న..అంతకంటే ముందు తాను మినహా మిగిలిన పది మంది ఎమ్మేల్యేలు..
నలుగురు ఎంపిలు వేరే పార్టీలోకి దూకేయకుండా ఆపాలి కదా…అంతకంటే ముందుగా తన కేసుల సంగతి..ఏంటి భవిష్యత్తు.. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నెట్టుకొచ్చిన వైసిపి అధినేత ఇప్పుడు తనను తాను ఎలా కాపాడుకోగలుగుతారు.
బాబు..మోడీ చెలిమి పటిష్టంగా ఉన్నంత కాలం బిజెపి జగన్ వైపు చూడదు.
ఒకవేళ అటూ ఇటూ అయి జగన్ మళ్లీ అరెస్ట్ అయితే పార్టీ గతేమి కాను.ఎవరైనా పార్టీ బరువును మోయడానికి సిద్ధపడినా క్యాడర్ ఆగుతుందా..!?
బిజెపి తలుపులు తెరుచుకోవు..
టిడిపి తలుపులు
తట్టాలంటే వైసిపి నాయకులకు మొహం చెల్లదు.సిగ్గు విడిచి తలుపులు తట్టినా ఎలాంటి అవమానాలు ఎదుర్కోవలసి వస్తుందో..మహా అయితే కొందరికి ప్రవేశం లభించవచ్చు..!
ఆ కోణంలో చూస్తే బిజెపి బెటర్ చాయిస్..ఆంధ్రలో ఇప్పుడు కొంచెం బలం ఏర్పాటు చేసుకున్న బిజెపి
సొంతంగా క్యాడర్ కోసం వెతుకులాట మొదలు పెడుతుంది.2029 నాటికి
ఎవరితో చెలిమి ఎలా ఉంటుందో తెలియదు.
అందులో చంద్రబాబుతో వ్యవహారం..నమ్మబుల్ కాదు.అందుకే బిజెపి తలుపులు తెరిచి ఉంచవచ్చు.అంటే ఉత్తరోత్రా చెల్లాచెదురైపోయే వైసిపి గణానికి అయితే బిజెపి..లేదంటే జనసేన..
ఎక్కడో ఒక దగ్గర నీడ దొరికితే కొంత సురక్షితం.
మళ్లీ ఈ రెండు పార్టీలు టిడిపికి దోస్తులే కదా అనే మెలిక కూడా ఉంది.
ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ..
వైసీపీలో చాలా మందికి అది మాతృసంస్థ.2014లో చతికిలపడిపోయి ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్న పెద్ద పార్టీ.
ఎవరు..ఎలాంటి వారు
వచ్చినా లోపలికి తీసుకునే విశాల దృక్పథం కలిగిన సంస్థ..వైసిపి బ్యాచికి అదే బెటర్..అక్కడ ఆశ్రయమైతే లభిస్తుంది కానీ రక్షణ కష్టమే.
ఏదో ఒకటి తప్పదు కదా..టార్గెట్ 2029..అటే పరుగు..!
కాంగ్రెస్ లో విలీనం ఇంకా మంచిదేమో..
బ్రతికి చెడి అనుకోవాల్సిన పనిలేదు..పుట్టింది అక్కడి నుంచే గనక…
మేమే గొప్ప అనే సీన్ గోవిందా..
బలం పోయినప్పుడు బలగాన్ని కాపాడుకోవాలి..
రేపు అటు నుంచి
సాధింపులు మొదలైతే..
రాజశేఖర రెడ్డి మొహం చూసి కొంత సాయపడే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ నుంచైనా..కొంతలో కొంత తెలుగుదేశం నుంచైనా..
మహానేత పేరు చెప్పుకుని
నేతగా చలామణి అయ్యే పరిస్థితి లేనప్పుడు మందిలో ఒకడిగా మరో ఇన్నింగ్స్ మొదలెట్టవచ్చు..!
హస్త లాఘవం చూపించే రోజులు “చెల్లి”పోయాయి..
ఇప్పుడు హస్తమే శరణం..
హస్తినాపురమే శరణ్యం..
సురేష్ కుమార్..జర్నలిస్ట్
9948546286
9948546286