ముగసిన పత్రిక ధిగ్గజ ప్రస్థానం
తెలుగు నాట అందరి చేత వార్తలు చదివించేందుకు పత్రికా రంగాన్ని కొత్త పుంతాలు తొక్కించించిన ధిగ్గజుడు ఇంటిపేరే ఈనాడుగా స్థిరపడిన రామోజీరావు ప్రస్థానం ముగిసింది. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసాడు.
అనారోగ్యం తో బాధపడుతున్న రామోజీరావు పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ని వెంటిలేటర్ పై ఉంచారు.
రామోజీ రావు మృతిపట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ రామోజీరావు మరణం తెలుగు నాట తీరని లోటన్నారు.
ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు….
*ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి …
*మీడియా రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడికి, ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు రామోజీరావు గారని గుర్తుచేసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…
*వీరి మృతి మీడియా రంగానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారచంద్ర బాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తో పాటు పలువురు సంతాపం ప్రకటించారు.