సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి

Admin
By Admin

సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి

వరంగల్ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

పదవీవిరమణ అనంతరం పోలీస్ అధికారులు స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పదవీ విరమణ చేసిన పోలీస్‌ అధికారులకు సూచించారు. వరంగల్‌ పోలీస్‌ విభాగంలో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి శుక్రవారం పదవీవిరమణ చేసిన పోలీస్‌ అధికారులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఘనంగా సత్కరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీస్‌ అధికారుల సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పదవీవిరమణ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా పాల్గోని, పదవీవిరమణ చేస్తున్న ఇన్స్‌స్పెక్టర్ బాలకృష్ణ, ఎస్. ఐ మునిరూల్లా, ఏ. ఎస్. ఐలు సమ్ములాల్, శ్యామ్ సుందర్, సమ్మయ్య, హెడ్ కానిస్టేబుల్ యాకుబ్ రెడ్డిలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాతుడుతూ సుదీర్ఘ కాలంగా పోలీస్‌ శాఖలో పనిచేయడంమే కాకుండా క్లిష్టసమయాల్లో విధులు నిర్వహించి నేడు శాంతియుతమైన వాతరణం కల్పించడంలో వీరు ప్రధాన కారుకులని, నేటి తరం పోలీసులకు వీరు స్పూర్తిగా నిలుస్తారని. ముఖ్యంగా పోలీసులు తమ విధుల్లో రాణించడం ప్రధాన కారణం వారి కుటుంబ సభ్యులని, కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారంతోనే పోలీసులకు అప్పగించిన పనుల్లో రాణిస్తున్నారని, పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్య పరి రక్షణకై నిరంతరం వ్యాయామం, యోగ సాధన చేయాలని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.
ఈ కార్యక్రమములో టైనీ ఐ. పి ఎస్ శుభం నాగ్,అదనపు డిసిపిలు రవి, సంజీవ్‌, సురేష్‌కుమార్‌, ఏసీపీ అనంతరయ్య, ఆర్‌.ఐలు శ్రీధర్‌, స్పర్జన్‌రాజ్‌, చంద్రశేకర్‌, ఆర్. ఎస్. ఐ శ్రవణ్ కుమార్,పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్‌కుమార్‌తో పాటు పదవీవిరమణ పోందిన పోలీస్‌ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *