ఓదెల-2 చిత్రంలో కులం పేరుతో ఉన్న అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌కు మరియు ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారికి సూచించిన బీసీ కమిషన్
ఈ నెల విడుదలైన ఓదెల-2 సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ 116 రూపాయలు కానుక రాయించిన విషయమై జరిగిన వాద ప్రతివాదనలో పిచ్చిగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడిన విషయమై ఈరోజు పిచ్చిగుంట్ల కులానికి చెందిన పి.మల్లేష్ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసి, ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగించాలని కోరడం జరిగింది.
పిటిషనర్ ఈ విషయమై అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ చేయలేదని తెలిపారు.
ఈ విషయమై కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఒక లేఖ రాస్తూ వెంటనే దర్యాప్తు చేసి, ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయిత, ఆ అభ్యంతర పదాలను వాడిన నటులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ఈ చిత్రం ప్రస్తుతం సినిమా థియేటర్‌లో నడుస్తున్నందున ఇకపైన జరిగే చిత్ర ప్రదర్శనలో ఈ అభ్యంతర పదాలను తొలగించి థియేటర్‌లలో ప్రదర్శించాలని కోరడం జరిగింది. తెలంగాణ డిజిపికి కూడా ఈ ఉత్తరం కాపిని పంపిస్తూ వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
సెన్సార్ బోర్డు అధికారి రాహుల్ గౌలీకర్ ఆ సన్నివేశములోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఫిలిం సెన్సార్ బోర్డు ఈ అభ్యంతరకర పదాలు ఉన్నటువంటి చిత్రాన్ని, ఆ పదాలు తొలగించకుండా కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని కమిషన్ తప్పు పట్టింది. ఈ విషయమై ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారికి ఒక లేఖ వ్రాయం జరిగిం